Sunday, May 5, 2024

మాదిపాడు విషాదం: విద్యార్థులకు స్వరూపానందేంద్ర ఆర్థిక సాయం

గుంటూరు జిల్లా మాదిపాడులో వేద విద్యార్థుల  కృష్ణా న‌ది లో ప‌డి మ‌ర‌ణించిన ఘటనపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. మాదిపాడు వేద పాఠశాల విద్యార్థుల విషాద వార్త కంటతడి పెట్టించిందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తామని ప్రకటించారు. మిగిలిన విద్యార్థులను మా వేద పాఠశాలలో చదివించడానికి తాము సుముఖంగా వున్నామని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు.

కాగా, ఈత కోసం కృష్ణా నదిలోకి వెళ్లిన ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే. గంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని మాదిపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సంగం సమీపంలోని బీరా పేరు వాగులో గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమయింది. అతడిని ఫుల్లయ్యగా గుర్తించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement