Saturday, May 4, 2024

Breaking: టీచర్ల బదిలీల నిలిపివేత.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్​లో టీచర్ల బదిలీలకు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు అధికారులు సర్య్కులర్​ జారీ చేశారు. కాగా, జూన్​ 30వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా, దీనిపై ఇవ్వాల మళ్లీ విద్యాశాఖ నుంచి ఉత్తర్వులను నిలిపి వేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. సాధారణ బదిలీలతో పాటు టీచర్ల బదిలీలపై ఇచ్చిన ఉత్వర్వులను ప్రభుత్వం ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది.

కాగా, గతంలో టీచర్ల ట్రాన్స్​ఫర్లకు ఆమోదం తెలిపినప్పుడు పలు ఆసక్తికరమై విషయాలను ప్రభుత్వం వెల్లడించింది. అనధికారికంగా విధుల్లో గైర్హాజరుగా ఉన్నవారు, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొంటున్నవారు, సస్పెన్షన్​లో ఉన్న వారు ట్రాన్స్​ఫర్​కి అనర్హులగా పేర్కొన్నారు. అంతేకాకుండా సెక్రెటేరియట్​లో పనిచేసే జీవిత భాగస్వామి ఉన్న వారికి కృష్ణా, గుంటూరు జిల్లాలకు బదిలీ చేస్తామని తెలిపారు.  ఇప్పుడు బదిలీలను నిలిపివేయడంతో ఏపీలోని ఉపాధ్యాయ లోకం మొత్తం ఆవేదనకు గురవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement