Sunday, April 28, 2024

AP | కడప కోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తా : సునీత

ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్‌ వివేకా హత్యా నిందితుల పేర్లను ఎక్కడా కూడా ప్రస్తావించవద్దని గురువారం కడప కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కడప కోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తానని వైఎస్‌ వివేకా కూతురు సునీత వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్‌ షర్మిల తరుఫున ప్రచారం చేస్తున్న సునీత కేసుపై స్పందించింది. న్యాయం కోసం ప్రజాతీర్పు కోరుతుంటే వైసీపీ అడ్డుపడుతుందని, పులివెందులలో ప్రచారం చేయకుండా కేసులు వేస్తున్నారని ఆరోపించారు.

ఈ కేసులో వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డిని హంతకుడిగానూ, సీఎం జగన్‌ ఆయన్ను కాపాడుతున్నట్లుగానూ చేస్తున్న ప్రచారాలను ఆపాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా సునీత, షర్మిల, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, నారా లోకేష్‌, పురందేశ్వరి, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవిలు వివేకా హత్య కేసు అంశం మాట్లాడవద్దని వైసీపీ వైఎస్సార్‌ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు కడప కోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రచారంలో భాగంగా తాను ఇంటింటికి రాలేకపోతున్నానని, ఎన్నికల్లో షర్మిలను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement