Tuesday, April 30, 2024

ముగ్గురు జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు : క‌లెక్ట‌ర్

శ్రీకాకుళం : సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన స్పందనలో అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరణలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.విజయ సునీత ఉన్నారు. స్పందన కార్యక్రమంకు హాజరు కాని డ్వామా పీడీ, మత్స్య శాఖ జేడీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. రీ ఓపెన్, బియాండ్ ఎస్ఎల్ఎ లో పెండింగ్ లో లేకుండా చేయాలన్నారు. 65 రీ ఓపెన్ లో ఉన్నాయని, ఇందులో రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపాల్టీ, సమగ్ర శిక్ష, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఎక్సైజ్, పోలీసు శాఖ, తదితర శాఖలలో పెండింగ్ ఉన్నాయని, వాటిని తక్షణమే పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.

స్పందన పోర్టల్ లో పెండింగ్ లో ఏమీ లేవని, ఈ విధంగానే కొనసాగించాలన్నారు. విద్యాశాఖ, సమగ్ర శిక్ష, గురుకులాలకు సంబంధించి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం, పంచాయతీ రాజ్, గృహ నిర్మాణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్, తదితర శాఖల సమస్యలపై 379 అర్జీలు స్వీకరించారన్నారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, డీఆర్డీఏ పీడీ శాంతి శ్రీ పాల్గొన్నారు. స్పందన కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement