Thursday, April 25, 2024

ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

ఇచ్ఛాపురం, : కథానాయకుడు రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం ఆంధ్రా – ఒడిషా అభిమానులు శ్రీ తులసమ్మ అమ్మవారి సన్నిధిలో చరణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు జరిపించారు. పేదలకు, ప్రభుత్వ ఆస్పత్రిలో పళ్లు, రొట్టెలు, పానీయాలు సుమారు 150 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు, మండల నాయకులు తిప్పన దుర్యోధన రెడ్డి , రామ్ చరణ్ యూత్ అధ్యక్షులు గౌరీ శంకర్, తేజ ,జి. శంకర్ రెడ్డి, డి. శంకర్ రెడ్డి ,కె. మాధవ్ రెడ్డి ,ఎన్. వాడంబర్ రెడ్డి , పూర్ణ , మధు ,రొంప పూర్ణ , డి. వేణురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement