Sunday, April 28, 2024

AP : దొంగతనం కేసును చేధించిన పోలీసులు..

శ్రీకాకుళం, మార్చి 31(ప్ర‌భ‌న్యూస్‌): ఇటీవ‌ల జ‌రిగిన దొంగ‌త‌నం కేసును శ్రీ‌కాకుళం పోలీసులు చేధించారు. కేసుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను డీఎస్పీ శృతి మీడియాకు వెల్ల‌డించారు.

భద్రాచలానికి చెందిన చల్లా జంపన్న,అల్లూరి సీతారామరాజు జిల్లా సీతారాంపురం గ్రామానికి చెందిన సాంబశివరావులు చెడు వ్యసనాలకు లోనే అప్పులు పాల‌య్యారు. ఒంట‌రిగా ఉన్న మ‌హిళ‌ల‌ను వెంబ‌డించి దొంగ‌త‌నాల‌కు అల‌వాటు ప‌డ్డార‌న్నారు. ఈక్ర‌మంలోనే అరసవిల్లి వెళ్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకొని ఆటోలో వస్తుండగా అదే ఆటోలో ఉన్న భవిడిపాటి జగదాంబ ఒంటిపై నగలు ఉండడాన్ని వారు గమనించారు. ఆమె ఒంటరిగా రావడంతో ఆమెకు తెలియకుండా ఆమె వెనకాలే ఇంటికి వెళ్లి అంతా పరిశీలించారు. ఆమె ఇంటి వ‌ద్ద రెక్కి నిర్వ‌హించి ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి బంగారు ఆభరణాలు దోచుకుని వెళ్లిపోయారని తెలిపారు.

- Advertisement -

వీరిద్దరూ ఆ బంగారాన్ని పంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకొని వాటిని నగల రూపంలో కాకుండా వాటిని కరిగించి కడ్డీల రూపంలో మార్చారని, ఇద్దరు పంచుకున్నారని తెలిపారు. తర్వాత ఆదివారం ఉదయం తాము బంగారం అపహరించిన ఇంట్లోని వృద్ధురాలు ఎలా ఉందో తెలుసుకునేందుగాను శ్రీకాకుళం పట్టడం కోటేశ్వరాలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుడుతుండగా, పోలీసులు వీరిద్దరినీ పట్టుకొని ప్రశ్నించడంతో వారిద్దరూ వృద్ధురాలిని బంధించి బంగారం చోరీ చేసిన వ్యక్తులుగా స్పష్టమైందని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం రూరల్ సీఐ ఎల్ సన్యాసినాయుడు, వన్ టౌన్ ఎస్ఐ బి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement