Saturday, April 27, 2024

గృహ హక్కు పేరుతొ ప్రభుత్వ దోపిడీ: కూన రవికుమార్‌

శ్రీకాకుళం, ప్రభ న్యూస్‌: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ దోపిడి పాలన కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు, మాజీ విప్‌ కూన రవికుమార్‌ ఆరోపించారు. నిన్న సాయంత్రం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో రవికుమార్‌ మాట్లాడుతూ, సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో గ్రామాల్లో ప్రజకు ఇక్కట్లు తప్పడం లేదన్నారు. ఈ సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో ఈ ప్రభుత్వం పేదల సొమ్ము దోచుకుంటున్నాయని విమర్శించారు. గ్రామ ఖంటం భూములు ప్రభుత్వ భూములు కావని, సొంతడబ్బుల‌తో కట్టుకున్న ఇళ్లకు సీఎంకి కప్పం ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. సొంత స్థలానికి రిజిస్ట్రేష్రన్‌ పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తుందన్నారు. ఎవరూ 10 వేలు రూపాయిలు కట్టవద్దని, మీకు అండగా తెలుగుదేశం పార్టీ వుంటుందని తెలిపారు.

తుఫాన్‌లో పంటలు పోయి రైతులు ఆందోళనలో చెందుతున్నారని, వారికి వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. రైతులకు పదివేలు కట్టి రిజిస్ట్రేష్రన్‌ చేసుకోవాలని వేధిస్తున్నారు.. ఇది దారుణమన్నారు. చట్టానికి వ్యతిరికంగా శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ యంత్రాంగం గుండాయిజం చేస్తోందని విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే పట్టాలు, ఇళ్ళు ఇస్తామని తెలిపారు. పేదవాడి పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే పువ్వుల్లో పెట్టి అందిస్తామన్నారు. ఈ పత్రికా సమావేశంలో పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షులు పీఎంజిబాబు, రాష్ట్ర రైతు ప్రధానకార్యదర్శి సింతు సుధాకర్‌, న గరపార్టీ అధ్యక్షులు మాధారపు వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement