Tuesday, October 8, 2024

Skill case – చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు మధ్యాహ్నంకు వాయిదా

విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన తెదేపా అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. మధ్యాహ్నం 2.30కి తీర్పును వెలువరించనున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్టు వెల్లడించింది.చంద్రబాబు కస్టడీ వ్యవహారంపై శుక్రవారం ఉదయం 10.30 గంటలకే నిర్ణయం వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. కానీ, మరోసారి తీర్పు వాయిదా పడింది.

మరోవైపు, తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా అనిశా కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ.. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో మధ్యాహ్నం తీర్పు వెలువడే అవకాశం ఉంది.

జ్యుడిషియల్‌ రిమాండ్‌ 24 వరకు పొడిగింపు

తెదేపా అధినేత చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈనెల 24 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం జైలులో ఉన్న ఆయన్ను పోలీసులు ఏసీబీ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. రిమాండ్‌ సమయం ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయాన్ని న్యాయమూర్తి కోరారు. జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చంద్రబాబు న్యాయమూర్తితో చెప్పారు. తన హక్కులను రక్షించాలని.. న్యాయాన్ని కాపాడాలని కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement