Monday, May 6, 2024

Big Breaking | భారత్‌ని విశ్వగురువుగా మారుస్తున్న శక్తి మోదీ: చంద్రబాబు

రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదే అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీకి అండగా ఉంటామని చెప్పడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని చెప్పారు. చిలకలూరిపేటలో ఆదివారం సాయంత్రం టీడీపీ, జనసేన, బీజేపీలు నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ప్రశంసిస్తూ, ఆకాశానికి ఎత్తేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు ప్రసంగం హైలైట్స్:

- Advertisement -

మీరు ఇవ్వబోయే తీర్పు రాష్ట్ర భవిష్యత్తను మారుస్తుంది. మీ జీవితాలను తీర్చి దిద్దే బాధ్యత.
మూడు పార్టీల జెండాలు వేరైనా… అజెండా ఒకటే.

ప్రజా సంక్షేమం కోసం తపించే వ్యక్తి పవన్ కల్యాణ్.

మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు.

మోదీ నినాదం… సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్. మోదీ అంటే ఒక నమ్మకం.

ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానానికి చేర్చిన నేత మోదీ. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుస్తారు.

కరోనా సమయంలో మన ప్రాణాలను కాపాడింది మోదీనే. వంద దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత మోదీదే.

దేశంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి. పేదరికం లేకుండా చేయగల శక్తి మోదీకి ఉంది.

మోదీ ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలి. సరైన సమయంలో దేశానికి మోదీలాంటి నేత వచ్చారు.

దేశం దూసుకుపోతుంటే… రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయింది.

వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి లక్ష్యం కావాలి.

ల్యాండ్, శాండ్, మైన్, వైన్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న దుర్మార్గుడు జగన్.

రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమమే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి కనిపిస్తుంది.

జగన్ అధికార దాహానికి బాబాయ్ బలయ్యాడు. జగన్ ఎలాంటి వాడో ఆయన చెల్లెళ్లే చెపుతున్నారు
.
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడారు. అమరావతిని భ్రష్టు పట్టించారు.

బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేశారు.

కేంద్ర ప్రభుత్వ సాయంతో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. పోలవరంను జగన్ గోదావరిలో కలిపేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను తరిమేశారు.

విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారు.

జగన్ పాలనకు ముగింపు పలుకుదాం. ఎన్టీఏను గెలిపించుకుందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement