Sunday, May 19, 2024

టీచర్ల అంశంలో హరీశ్ రావు విమర్శలకు సజ్జల కౌంటర్

టీచర్ల అంశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చేసిన విమర్శలకు ఏపీ ప్రభుత్వ స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒక గ్యాంగ్ ఏది అంటోందో దాన్నే వాళ్లు అంటున్నారన్నారు. ఆ గ్యాంగ్ తో జతకట్టి ఆయన మాట్లాడినట్లు ఉందన్నారు. పార్టీగా టీఆర్ఎస్ మమ్మల్ని ఏమీ అనలేదన్నారు. హరీశ్ రావుకు ఏమైనా వ్యక్తిగత సమస్యలున్నాయేమోనని సజ్జల అన్నారు. హరీశ్ రావుకు ఎందుకు అంత ఆవేశం వచ్చిందో అని అన్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య అంశం కాదన్నారు. సీఎం జగన్ ను విమర్శించి రెచ్చగొట్టాలని చూస్తున్నట్లు ఉందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement