Monday, September 25, 2023

AP: ఆర్టీసీ బస్సు బోల్తా.. 9మందికి గాయాలు

ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుండి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణీకులు గాయపడ్డారు.

- Advertisement -
   

గాయపడ్డ ప్రయాణికులను హుటాహుటిన 108లో యర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ జరిగిన తీరును పరిశీలించి ట్రాఫిక్ కు అంతరాయం కలగుకుండా చేశారు. గాయపడిన క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement