Thursday, May 16, 2024

ఆలంకొండకు చేరుకున్న సీఎం జగన్

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని కృష్ణగిరి మండలం ఆలంకొండ వద్ద పంప్ హౌస్ నుండి 77చెరువులకు నీరందించే పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు 10.10 గంటలకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్, ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, డిఐజి సెంథిల్ కుమార్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్, కోడుమూరు శాసనసభ్యులు డా .సుధాకర్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో కృష్ణగిరి మండలం ఆలంకొండ హెలిప్యాడ్ వద్దకు ఉదయం 10.20 గంటలకు బయలుదేరి వెళ్లి ఆలంకొండకు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement