Saturday, May 4, 2024

Roja Fire – ప‌వ‌న్ ను శృంగార తార స‌న్నీ లియోన్ తో పోల్చిన రోజా

అమ‌రావ‌తి – మంత్రి రోజా జనసేనాని పవన్ కల్యాణ్ పై మ‌రోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంస్కారం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడడం హాస్యాస్పదంగా అనిపిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా శృంగార తార, బాలీవుడ్ భామ సన్నీ లియోన్ తో పవన్ ను పోల్చారు. సంస్కారం గురించి పవన్ మాట్లాడుతుంటే సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్టుందని ఎద్దేవా చేశారు. అమ‌రావ‌తిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, పవన్ ఎవరి మాటా వినడని, అందుకే భార్యలు కూడా వదిలేశారని ఆయ‌న‌ను సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పనికిమాలిన వ్యక్తి అని, కరోనా సంక్షోభం సమయంలో హైదరాబాద్ లో దాక్కున్నార‌ని ఘాటుగా విమర్శించారు.

ఎంతసేపూ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును చదవడమే పవన్ పని అని ప‌వ‌న్ ను తిట్టి పోశారు. మా అమ్మను తిట్టారు, నా పెళ్లాన్ని తిట్టారు, నా పిల్లలను తిట్టారు అనే ఏడుపు తప్ప పవన్ మరో మాట మాట్లాడడంలేదని రోజా పేర్కొన్నారు. చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పవన్ రెచ్చిపోతున్నార‌ని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement