Tuesday, April 30, 2024

ఎపిలో రిల‌య‌న్స్ గ్రూప్ రూ.40వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్ – ముఖేష్ అంబానీ

విశాఖ‌ప‌ట్నం – రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎపిలో వివిధ రంగాల‌లో రూ.40 వేల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డులు పెట్ట‌నుంది.. ఈ మేర‌కు ఆ సంస్థ ఛైర్మ‌న్,మేనేజింగ్ డైరెక్ట‌ర్ ముఖేష్ అంబానీ ఎపి గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌ద‌స్సులో ప్ర‌క‌టించారు..
“మేము 40,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడం ద్వారా ఏపీలో అతిపెద్ద , ఉత్తమమైన డిజిటల్ నెట్‌వర్క్ సృష్టిస్తున్నాము. మా 4G నెట్‌వర్క్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో నివసించే వారితో సహా 98 శాతం ఎపి జనాభాను కవర్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌తో సహా భారతదేశం అంతటా జియో యొక్క ‘ట్రూ 5G’ 2023 చివరిలోపు పూర్తవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాం” – రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement