Monday, April 29, 2024

Red Book – నారా లోకేష్ కు ఎపి సిఐడి నోటీసులు

విజ‌య‌వాడ – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కు ఏపీ సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆయనకు నోటీసులివ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో సీఐడీ అధికారులు వాట్సాప్ లో ఆయనకు నోటీసులు పంపారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్నట్లు ఆయన వారికి సమాధానం ఇచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 9కు వాయిదా వేసింది.

అసలేంటీ రెడ్ బుక్.?

కొందరు అధికారులు అత్యుత్సాహంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని వారందరి పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేసుకున్నట్లు యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ చెప్పారు. అధికారంలోకి వచ్చాక జ్యుడీషియల్ విచారణ జరిపించి బాధ్యులను తప్పక శిక్షిస్తామని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్క తేల్చే పుస్తకం (రెడ్ బుక్) అంటూ ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని బహిరంగ సభలో చూపించారు. చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైల్లో ఉంచారని, అందరి పేర్లు ఇందులో రాసుకున్నానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement