Sunday, May 19, 2024

AP | గ్రానైట్ కోసమే కుప్పం పై పెద్దిరెడ్డి కన్ను : చంద్రబాబు

కుప్పం (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : కుప్పం నియోజకవర్గ పరిధిలోని గ్రానైట్ నిక్షేపాలను కొట్టేయడానికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుప్పం పై కన్ను వేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. కుప్పం పర్యటన లో భాగంగా ఆయన ఈరోజు శాంతి పురం బహిరంగ సభలో ప్రసంగించారు.. ఆ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ టిడిపి ఓటమి ఎరుగని స్థానాలు హిందూపురం, కుప్పం నియోజకవర్గాలే నని, తాను మొదటినుంచి అనేక సంక్షేమ పథకాలు కుప్పం నుంచి ప్రారంభించానని,ఒక్క రోడ్డు ఉండే కుప్పం ను ఇవాళ ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేసారు.

తాను అధికారం కోల్పోయిన తర్వాత కుప్పం పై శీత కన్ను వేశారని అంటూ తాను కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తే వాళ్ళు హంద్రీ నీవా జలాలు కుప్పం కు రాకుండా చేశారన్నారు. మనం ప్రవేశపెట్టిన ఇజ్రాయిల్ టెక్నాలజీ ని మోడీ గుజరాత్ లో అమలుచేశారు. నియోజకవర్గం లోని గ్రానైట్ మీద ప్రేమతోనే మంత్రి పెద్దిరెడ్డి తరచుగా కుప్పం వస్తుంటారని ఆరోపించారు
సరైన అనుమతులు లేకుండా జిల్లాలో ప్రాజెక్టులు చేపట్టడం వల్లనే చివరకి కోర్టుకి వెళ్లి ఫైన్ లు కట్టారని ఎద్దేవా చేసారు.జాబ్ కేలండర్ ఏమైందని, ఐదేళ్లలో ఒక్కరికీ ఉద్యోగం రాలేదు కానీ ఒకే ఇంట్లో ఒక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపి పదవులు ఉన్నాయన్నారు.

ఎమ్మెల్యే లు ప్రజా ద్రోహులుగా మారారంటే దానికి కారణం సీఎం కనుక మారాల్సింది సి ఏం అని అన్నారు.శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పిఏ ఆత్మహత్య వెనుక అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం కొత్తగా తెస్తున్న ల్యాండ్ టైటలింగ్ చట్టం చాలా ప్రమాదకరమైనదని,దీంతో ప్రజల భూములు కొట్టేయడం చాలా సులభం అవుతుందని అంటూ ఈ చట్టం చదివితే నాకే భయమేస్తోందని చంద్రబాబు అన్నారు. గత ఎన్నికల్లో జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ కావాలన్నారు. ఉచిత బస్సు కారణంగా నష్టపోయే ఆటో డ్రైవర్లను ప్రత్యేక ప్యాకేజ్ తో ఆదుకుందామని అన్నారు. ఈ సభ లో తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement