Saturday, May 4, 2024

హైకోర్టులో రేషన్ డీలర్లకు ఊరట.. ఏపీ సర్కారుకు షాక్..

గోనె సంచుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి షాక్ వంటి వార్త.. తాము నష్టపోతున్నామని చెప్పిన వినకుండా అధికారులు తమ ఆదేశాలు పాటించాల్సిందేనని ఇబ్బందులకు గురిచేశారు. దీంతో రేషన్ డీలర్లు హైకోర్టును ఆశ్రయించగా ఇవ్వాల తీర్పు ఇచ్చింది ధర్మాసనం. కాగా, డబ్బులు ఇచ్చే తీసుకెళ్లాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దశాబ్దాలుగా కమిషన్ తో పాటు, గోనె సంచుల ద్వారా డీలర్లు ఆదాయం పొందుతున్నారు.

తాజాగా గోనె సంచులుకు డబ్బులు ఇచ్చేది లేదంటూ ప్రభుత్వ అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో తాము నష్టపోతామని డీలర్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో హైకోర్టు ను ఆశ్రయించామని ఏపీ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మండాది వెంకట్రావు తెలిపారు. కాగా, డీలర్ల తరపున హైకోర్టు లో న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. దీంతో గోనె సంచుల డబ్బులు రేషన్ డీలర్లకే చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఒక్కో సంచికి 20 రూపాయలు చొప్పున ఇచ్చి తీసుకోవాలని‌ ప్రభుత్వానికి సూచన చేసింది. హైకోర్టు తీర్పుపై రేషన్ డీలర్ల సంఘం హర్షం చేస్తోంది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement