Thursday, April 25, 2024

స్వ‌రా భాస్క‌ర్ కి క‌రోనా – చ‌చ్చిపో అంటోన్న నెటిజ‌న్స్

క‌రోనా టాలీవుడ్ , బాలీవుడ్ సినీ సెల‌బ్రిటీల‌ని వెంటాడుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు న‌టీ న‌టులు క‌రోనాకి గుర‌య్యారు. కాగా ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ స్వ‌రా భాస్క‌ర్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. దాంతో ఆమె క్వారంటైన్ లో ఉంది. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో నెటిజ‌న్లు రెచ్చిపోయారు. ‘2022లో ఇదే బెస్ట్ న్యూస్’, ’ మీ మరణ వార్త కోసం ఎదురు చూస్తున్నాం’ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. స్వరాభాస్కర్ బీజేపీకి వ్యతిరేఖంగా మాట్లాడుతూ ఉంటుంది. బీజేపీ లీడర్లను చాలా సార్లు విమర్శించింది. దీంతో పాటు హిందుత్వవాదులపై కూడా విమర్శలు చేసింది. దీంతో ఈమెపై చాలా మంది కోపంగా ఇలా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవ‌రినైనా కోలుకోవాలి అనాల్సింది పోయి వారి మ‌ర‌ణాన్ని కోరుకున్నారంటేనే అర్థ‌మ‌వుతోంది ఆమెపై నెటిజ‌న్స్ ఎంత కోపంగా ఉన్నారో అని.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement