Thursday, April 25, 2024

Rain Alart: ఏపీకి మళ్లీ వాన గండం.. ఆ జిల్లాలు అతలాకుతలం!

ఏపీకి మరోసారి వాన గండం ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు వణికిపోయాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నేటికి ఆయా ప్రాంతాలు ఇంకా వరదలోనే ఉన్నాయి. పదుల సంఖ్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరోమారు ఈ నెల 27 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. నెల్లూరు, చిత్తూరు, కడప​, ప్రకాశం, అనంతపురం, గుంటూరు, కృష్ణా, కోస్తాలోని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement