Thursday, May 2, 2024

బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని సమీప ప్రాంతాల్లో నేడు అల్పపీడనం ఏర్పడుతుందని, ఆ తర్వాత 48 గంటల్లో అది మరింతగా బలపడి పశ్చిమ వాయవ్యంగా ఉత్తర తమిళనాడు తీరం దిశగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

అలాగే, ఈ నెల 11, 12వ తేదీల్లో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు,  అనంతపురం, కర్నూలు, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement