Saturday, April 17, 2021

హైదరాబాద్ లో వర్షం..

గత కొన్ని వారాలుగా ఎండ వేడిమితో అల్లాడుతున్న భాగ్యనగర వాసులను వరుణుడు పలకరించాడు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి చిరు జల్లులు కురిశాయి. ఈ తెల్లవారుజాము వరకూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతోనే ఈ చిరు జల్లులకు అవకాశం ఏర్పడిందని, కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కూకట్ పల్లి, అమీర్ పేట, ఖైరతాబాద్, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, మాదాపూర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో నిత్యమూ రాత్రిపూట నమోదయ్యే సగటు ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల మేరకు తగ్గాయి. తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. నేడు రేపు కూడా ఓ మోస్తారు జల్లులు కురిసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News