Thursday, April 25, 2024

మహారాష్ట్రలో ఆగని కరోనా విజృంభన

మహారాష్ట్రలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలోని మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగు చూశాయి. బుధవారం మహారాష్ట్రలో 59,907 కరోనా కేసులు రికార్డు కాగా మొత్తం కేసుల సంఖ్య 31,73,261కి పెరిగింది. కరోనా కేసుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. 24 గంటల్లో కరోనాతో 322 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 56,652కు చేరింది. మహారాష్ట్రలో మరణాల శాతం 1.79గా నమోదైంది. ఏప్రిల్ 4వతేదీ నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రస్థుతం 5,01,559 యాక్టివ్ కేసులున్నాయి. ముంబై నగరంలో 10,442 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా, 24 మంది మరణించారు. ఒక్క పూణే నగరంలోనే 5,637 కేసులు, నాగపూర్ డివిజన్ లో 8,846 కేసులు రికార్డు అయ్యాయి. నాగపూర్ సిటీలో 3,738 కరోనా కేసులు వెలుగుచూశాయి. నాసిక్ డివిజన్లో 8,181, ఔరంగాబాద్ డివిజన్ లో 3,398, అకోలా డివిజన్ లో 784 కరోనా కేసులు బయటపడ్డాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement