Wednesday, May 15, 2024

Raa … Kadiliraa Meeting – గుడివాడ గంజాయి మొక్కను ఈసారి కూకటి వేళ్ళతో పెకలిస్తాం – చంద్ర బాబు

గుడివాడ – సీఎం జగన్‌ ఒక రాజకీయ వ్యాపారి, అధికారం అంటే ఆయనకు దోపిడీ అని టి డి పి అధినేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ‘రా..కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైకాపా పాలనలో వంద సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని ధ్వజమెత్తారు. గుడివాడలో వైకాపా గంజాయి మొక్కలను ఏరేస్తామన్న ఆయన.. బూతుల సామ్రాట్‌ను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు .

.కొడాలి నానిది నోరా డ్రైనేజా.. ఎంత ఫినాయిలే వేసి కడిగినా అతని నోరు మురికి కాలువేనంటూ వ్యాఖ్యానించారు. నోరు తెరిస్తే ఆయన బూతులు మాట్లాడుతుంటారని, ఎంత బూతులు మాట్లాడితే అంత పెద్ద నాయకులు అవుతారని అనుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తన వద్దే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుని, తనకే పాఠాలు చెబుతారా అంటూ నానిపై ఫైర్ అయ్యారు.

టీడీపీ జనసేనలు కలిశాయని తెలియగానే వైసీపీ నేతల్లో దడ మొదలైందని, ఏ సర్వే చూసినా తమ కూటమిదే విజయమని చెబుతున్నాయని చంద్రబాబు తెలిపారు. అందుకే 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుతున్నారని, రాజకీయాల్లో తాను ఎక్కడా ట్రాన్స్‌ఫర్లు చూడలేదన్నారు. ఇక్కడి చెత్తను అక్కడికి, అక్కడి చెత్తను ఇక్కడికి మార్చుతున్నారని చంద్రబాబు సెటైర్లు వేశారు. ఈ ప్రభుత్వానికి మరో 83 రోజులే సమయం వుందని ఆయన జోస్యం చెప్పారు. బ్రిటీష్ వారి మాదిరిగానే జగన్ కూడా వ్యాపార సంస్థలు పెట్టి సంపదనంతా దోచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఇవన్నీ చాలవన్నట్టు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నారు. అది భూ రక్షణ చట్టం కాదు.. భూ భక్షణ చట్టం. ఇది అమల్లోకి వస్తే రాబోయే రోజుల్లో ప్రజల ఆస్తులన్నీ కొట్టేస్తారు. ఇవాళ ఓట్ల దొంగలు పడ్డారు.. భవిష్యత్తులో భూముల దొంగలు పడతారు. తెదేపా అధికారంలోకి వచ్చాక భూ రక్షణ చట్టం రద్దు చేస్తాం. పేదల ప్రభుత్వం కాదిది.. పేదల రక్తం తాగే ప్రభుత్వం. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఏమైంది? ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ అయినా ప్రకటించారా? జాబు రావాలంటే తెదేపా జనసేన ప్రభుత్వం రావాలి. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. సీఎం తన సొంత చెల్లితో పాటు సీబీఐపైనా కేసులు పెట్టించారు. మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగబోనని చెప్పారు.. చేశారా? జగన్‌ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ. తప్పుడు, చీకటి జీవోలను వెబ్‌సైట్‌లో దాచి పెట్టారు. పద్ధతిలేని రాజకీయాలు చేసే వారి వల్ల లాభం లేదు” అని చంద్రబాబు అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement