Monday, December 4, 2023

AP: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి.. టీడీపీ

ఎన్టీఆర్, ప్రభ న్యూస్ బ్యూరో : రాజ్యాంగం ద్వారా కల్పించిన ఆర్టికల్ 19, 20, 21 భారత పౌరుడు నిరసన తెలియజేసే హక్కును కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జిల్లా మెజిస్ట్రేట్ ను ప్రతిపక్షాలు నిరసన తెలియజేయడానికి అనుమతి ఇప్పించవలసిందిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావును తెదేపా ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు అభ్యర్థించారు. నగరంలోని కలెక్టరేట్ లో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ను కలిసిన నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా కలక్టర్ కు వినతిపత్రం అందజేసిన వారిలో మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంధ్ర, నెట్టెం రఘురాం, తెదేపా నేతలు మండలి బుద్ధ ప్రసాద్, కొనకళ్ళ నారాయణరావు, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), బోడే ప్రసాద్, వైవిబి రాజేంద్ర ప్రసాద్, వర్ల కుమార్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
   

ఈ సందర్భంగా తెదేపా నేతలు మాట్లాడుతూ… ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందన్నారు. ధనుంజయ్ రెడ్డిని జగన్ పిలిచే పేరు ధను అన్న.. ఆ ధను అన్న కింద ఛీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి పనిచేయాలి, సజ్జల కింద రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేయాలన్నారు. ఈ రాష్ట్రంలో హోంమంత్రి కనబడటం లేదన్నారు. ఎన్ని రోజులు నడుస్తాయి ఈ దౌర్జన్యాలు ? అని ప్రశ్నించారు. జీవో నెంబర్ 1 హైకోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. ఆర్టికల్ 19, 20, 21, 22 రాజ్యాంగ ఉల్లంఘనకు పోలీస్ యంత్రాంగం పాల్పడుతుందన్నారు. పోలీస్ కమీషనర్ సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నాడన్నారు. ఈనెల 29న ముఖ్యమంత్రి 1టౌన్ లో పర్యటనకు 50వేల మంది ప్రజలను సజ్జల సమీకరిస్తున్నాడన్నారు.

సెక్షన్ 144, 30 వాళ్ళకు అప్లై అవ్వదా ? ప్రశ్నించారు. ధర్నా చౌక్ లో తమకు అనుమతి ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి మాత్రం 50వేల మందితో మీటింగ్ పెట్టొచ్చా ? అన్నారు. పోస్టింగులకు కక్కుర్తిపడ్డ కొంత మంది పోలీస్ అధికారులు చేస్తున్న పనితీరు వల్ల రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఏర్పడుతుందన్నారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ పిల్లలు చంద్రబాబు కుటుంబానికి సంఘీభావం తెలియజేయటానికి వస్తే ఆంధ్రా, తెలంగాణా బోర్డర్ లో వేలాది పోలీసులను పెట్టి అందరినీ నిర్భందం చేశారన్నారు. పాకిస్థాన్ బోర్డర్ లో కూడా అంతమంది సెక్యూరిటీ ఉండరు కానీ, నిన్న గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వేలాది మంది పోలీసులను పెట్టి నిర్భంధం చేసి హింసించే హక్కు మీకు ఎవరిచ్చారు ? అని అన్నారు. ఎందుకు ఇంత తప్పు చేస్తున్నారు ? అన్నారు. వినాయకుడి గుడి వద్ద నుండి కనకదుర్గమ్మ గుడికి వెళ్లి పూజ చేసుకోవడానికి వీలు లేదా ? అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement