Monday, May 6, 2024

రైతు పథకాల గురించి వివరణ..

ఉలవపాడు : ఉలవపాడు మండలం లోని కరేడు గ్రామంలో గల రైతు భరోసా కేంద్రాన్ని ప్రకాశంజిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు పి.వి.శ్రీరామమూర్తి సందర్శించారు. రైతు సోదరులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయుట, ధాన్యం అమ్ముకొనుటకు రైతులు తమ పేర్లను రైతు భరోసా కేంద్రం దగ్గర నమోదుచేసుకోవాలని ఆయన రైతులకు తెలియజేశారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సున్నా వడ్డీ పంట రుణాల గురించి రైతులకు వివరించారు. రైతుల పేర్లను సున్నా వడ్డీ పంట రుణాల క్రింద, రైతులు ఎవరైతే లక్ష రూపాయలలోపు తీసుకొని సంవత్సరం లోపు ఎవరైతే తిరిగి బ్యాంకకు రుణాలు కట్టుకుంటారో వారికి వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఏడిఏ సిహెచ్‌ నాగరాజు, పిపిసి ఓ.వీరబాబు, మండల వ్యవసాయాధికారి యం.మాల్యాద్రి, గ్రామ రైతులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement