Saturday, May 4, 2024

AP : రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

(అమరావతి..ఆంధ్రప్రభ)
అంధ్రప్రదేశ్లోని 18జిల్లాల్లో తీవ్రమైన కరవు నెలకొందనీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. విజయవాడలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో తమ ప్రతినిధులు పర్యటించినట్లు తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి ఎదురు కాలేదని ఆయన అన్నారు.పంటలు వేయలేని దుస్థితి లో అన్నదాత ఉన్నట్లు చెప్పారు.440మండలాల్లో దుర్భరమైన పరిస్థితి ఉందనీ, ఆయకట్టు ప్రాంతంలో కూడా పంటలు లేవన్నారు.నీటి ప్రాజెక్టు ల్లో నీరు లేక ఎకరాకు కూడా నీరివ్వడం లేదనీ తెలిపారు.

ముఖ్యమంత్రి మాత్రం అసలు కరవు గురించే మాట్లాడరని, అధికారులతో కరవు పై సమీక్ష కూడా చేయడం లేదన్నారు.వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ దాక్కున్నాడనీ ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రి అసలు పత్తాలేడనీ చెప్పారు. కరవు ప్రాంతాల్లో మంత్రులు ఎందుకు పర్యటించరనీ ఆయన ప్రశ్నించారు. పంట నష్టం అంచనాలు వేసే వారెవరన్నారు. అధికారులు‌ వై ఎపి‌నీడ్స్ జగన్ కార్యక్రమం లో బిజీగా ఉన్నారనీ, జగన్ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? అని నిలదీశారు.క్యాబినెట్ లో కూడా కరవు పై చర్చ చేయకపోవడం దుర్మార్గం‌ కాదా? అని ఆయన విమర్శించారు.రాయలసీమ నుంచి వలసలు పోతున్నా పట్టించుకోవడం లేదని, ఈ రాష్ట్రానికి జగన్ ఎంతమాత్రం అవసరం లేదనీ రామకృష్ణ స్పష్టం చేశారు.ప్రజలను, రైతులను పట్టించుకోని జగన్ వద్దని ప్రజలు డిసైడ్ అయ్యారనీ, కృష్ణా జలాల విషయంలో ప్రధాని ఎపికి అన్యాయం చేశారనీ తెలిపారు. తెలంగాణ ఎన్నికలలో లబ్ది కోసమే ఈ గెజిట్ నోటిఫికేషన్ ఇక్సినట్లు చెపుతూ జగన్ మాట్లాడలేని దద్దమ్మ కాబట్టే ఎపికి పదే పదే అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఈనెల‌ 20, 21తేదీలలో 30 గంటల పాటు నిరసన కార్యక్రమం విజయవాడ లో చేపడతామని రామకృష్ణ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement