Saturday, May 18, 2024

రైతులకు సిరులు కురిపిస్తున్న పామాయిల్‌.. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంతో కలిసివచ్చిన అదృష్టం..

అమరావతి, ఆంధ్రప్రభ : ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ పరిణామాలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలపై దుష్ప్రభావం చూపగా అదే పరిణామాలు ఆయిల్‌ పామ్‌ రైతులకు అదృష్టం కలిసివచ్చింది. యుద్ధ ప్రభావంతో ప్రధానంగా నూనెల ధరలు భగ్గుమన్నాయి. దీంతో అంతర్జాతీయంగా వంట నూనెలకు గిరాకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పామాయిల్‌ రైతుల పంట పండింది. ఇన్నాళ్ల కష్టానికి ఫలితం దక్కింది. పెరిగిన ధరలతో ఆనందం వెల్లివిరుస్తోంది. కొన్ని నెలలుగా ధరలు పెరుగుతూ టన్ను రూ.23,500తో ఆల్‌ -టైం రికార్డు ధరకు చేరింది. ఎన్నడూ చూడని ధరలతో రైతులు మురిసిపోతున్నారు. మిగిలిన రైతులను పామాయిల్‌ సాగు వైపు మొగ్గు చూపేలా పరిస్థితులు మారుతున్నాయి.ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు అదృష్టయోగం పట్టింది. గతంలో ఊహించి నంతగా గిట్టు-బాటు- ధర దక్కకపోయినా పెంచిన మొక్కలు ఇస్తున్న కొద్దిపాటి ఆదాయాన్నే నమ్ముకునే వారు. మూడేళ్ల్ల క్రితం టన్ను రూ.8890 ఉంటే దానిని రూ.10 వేలు చేయాలంటూ ఆందోళన బాట పట్టారు. అప్పటి నుంచి ధరలు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది జనవరి నెలలో టన్ను రూ.17 వేలు ఉండగా ఏప్రిల్‌లో రూ.19,300కు చేరింది. ప్రస్తుతం ఆల్‌-టైం రికార్డు ధర రూ.23,500 సొంతం చేసుకుంది. అంతర్జాతీ యంగా వంట నూనెల ధరలు పెరగడం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, థాయిలాండ్‌ దేశం పామాయిల్‌ ఎగుమతులను నిషేదించడం వంటి పరిణామాల నే???పథ్యంలో ఆయిల్‌ పామ్‌కు ఈ దశ పట్టింది.

ఆయిల్‌ పామ్‌ తోటల సగటు- ఉత్పాదకత హెక్టారుకు 19.81 టన్నుల ఎఫ్‌ఎఫ్‌బీలు (తాజా పండ్ల గుత్తులు) కాగా 2020-21లో రాష్ట్రం 2.40 లక్షల టన్నుల ముడి పామాయిల్‌ను ఉత్పత్తి చేసింది.

రాష్ట్రంలో గంటకు 461 మెట్రిక్‌ టన్నుల ఎఫ్‌ఎఫ్‌బీల క్రషింగ్‌ సామర్థంతో 13 ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు- ఉన్నాయి. ఆయిల్‌ పామ్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి, కొత్త కేంద్ర ప్రాయోజిత జాతీయ ఎడిబుల్‌ ఆయిల్స్‌-ఆయిల్‌ పామ్‌ (ఎన్‌ఎంఇఓ -ఓ పీ) పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయిల్‌ పామ్‌ మిషన్‌ కింద రాష్ట్రంలో 1.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించాలని ప్రతిపాదించారు. 2021-22 నుండి 2024-25 వరకు రాష్ట్రాన్రికి ఎన్‌ఎంఇఓ -ఓ పీ కింద సంవత్సరాల వారీ లక్ష్యాలు ప్రతిపాదించింది 2021-22లో 15,000 హెక్టార్లు, 2022-23లో 20,000 హెక్టార్లు, 2023-24లో 24,000 హెక్టార్లు 2024-25లో 28000 హెక్టార్లుగా లక్ష్యాలు పెట్టింది. స్వదేశీ మొక్కలైతే హెక్టారుకు రూ.20,000, దిగుమతి చేసుకున్న మొక్కలకు రూ.29,000 చొప్పున మొక్కల పదార్థాలకు సవరించిన సబ్సిడీ ఉంటు-ంది. ప్రస్తుతం హెక్టారుకు రూ.12వేలు చెల్లిస్తున్నారు. నిర్వహణ కోసం హెక్టారుకు ప్రస్తుతం ఉన్న రూ.20,000 స్థానంలో రూ.21,000 సబ్సిడీగా అందించబడుతుంది. అదే విధంగా అంతర పంటలకు కూడా అంతే మొత్తంలో సబ్సిడీ అందజేస్తారు. యంత్రాలు మరియు పనిముట్లకు సబ్సిడీ విషయంలో, హెక్టారుకు ప్రస్తుతం ఉన్న రూ.1,500 బదులుగా మాన్యువల్‌ హై రీచ్‌ ఆయిల్‌ పామ్‌ కట్టర్‌కు రూ.2,500 అవుతుంది. రైతుల శిక్షణ కోసం, విస్తరణ కార్మికులు, అధికారులు మరియు ఇన్‌పుట్‌ డీలర్లకు శిక్షణ కోసం రూ.24,000 బదులు రూ.30,000 మరియు రూ.36,000 బదులుగా రూ.40,000 అందించబడుతుంది. 2021లో ఆయిల్‌పామ్‌ అభివృద్ధి కార్యక్రమానికి రూ.30.60 కోట్లు- ఖర్చు చేసి 8,801 హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగులోకి తీసుకొచ్చారు. 2021-22లో రూ.81.45 లక్షలు కేటాయించి 15 వేల హెక్టార్ల లక్ష్యం కాగా 10,561 హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగు చేయగా మరో 14,567 హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగును గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement