Monday, October 14, 2024

Paderu – లోయలో పడ్డ బొలెరో వాహనం – ఒకరి మృతి – 10 మందికి గాయాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం రాయికోట గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఓ బొలెరో వాహనం లోయలోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులతో పాటు అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.

బొలెరో వాహనంలో 20 మంది వలస కూలీలు రాయికోట గ్రామం నుంచి రాజమండ్రికి వెళ్తున్నారు. వారు బయలుదేరిన కాసేపటికే బొలెరో వాహనం లోయలోకి దూసుకెళ్లడం గమనార్హం. ఈ ప్రమాదంలో నూకరాజు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంతో రాయికోట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement