Sunday, April 28, 2024

Road show – అన్నపూర్ణ మన హైదరాబాద్ – ఇక్కడ స్థిర పడిన ఏ రాష్ట్రం వారైనా మా వాళ్లే – కేటీఆర్

హైద‌రాబాద్ అభివృద్ధి చెన్నై నుంచి ర‌జినీకాంత్‌కు అర్థ‌మైంది.. కానీ ఇక్క‌డున్న ప్ర‌తిప‌క్ష గ‌జినీల‌కు అర్థ‌మైత‌లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి మాధ‌వ‌రం కృష్ణారావుకు మ‌ద్ద‌తుగా నిర్వ‌హించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఆలాగే కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ లో నిర్వహించిన రోడ్ షో లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఆరున్నర సంవత్సరాల పని తీరు మీ ముందుందన్నారు.

హైదరబాద్ లో స్థిరబడిన అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు . ఏ రాష్ట్రం అయిన మేము కాపాడుకున్నామని, పెట్టుబడులు ఆకర్షిస్తు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు ., కుత్బుల్లాపూర్ లో అభివృద్ది చేసి చూపించామన్నారు మంత్రి .

అంతేకాకుండా.. ‘ఇక్కడి నుంచి సిటీ కి వెళ్ళాలన్న ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు రోడ్ల విస్తరణ తో ప్రయాణం సులువు అయ్యింది. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ది చెందింది. మాధ‌వ‌రం కృష్ణారావు, . కె.పి వివేక్ లను గెలిపించాలి. కేసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి.. 5 సంవత్సరాలకు ఒక సారి ఎలక్షన్ వస్తుంది.. కాబట్టి అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. జీడిమెట్ల, గాజులరామారం ఇండస్ట్రీస్ లో ఎప్పుఢైన కరెంటు ప్రాబల్యం ఉందా.. అప్పుడు ఎట్లుండే , ఇప్పుడు ఎలా ఉంది.. ఈ ఏరియాలో 24 గంటలు తాగునీరు అందిస్తాం.. బీఆర్‌ఎస్‌ను గెలిపించండి..జీడిమెట్ల ఏరియాకు మెట్రో ట్రైన్ ఏపిస్తాం.. కుత్బుల్లాపూర్ కి మెట్రో రైల్ తెప్పించే బాధ్యత నాది అన్న కేటీఆర్. సూరారం కాలనీ 60 గజాలలో నివాసితులకు ఎలక్షన్ తర్వాత పట్టాలు ఇస్తాం

గండిమైసమ్మ చౌరస్తా దగ్గర ప్లైఓవర్ నిర్మిస్తాం.. మేం అధికారం లోకి గ్యాస్ సిలెండర్ ధర 400 కే ఇస్తాం.. పని చేసే ప్రభుత్వాన్ని పట్టించుకోక పొతే మళ్ళీ ఇబ్బంది పడతాం. హైదరాబాద్ బాగుండాలంటే కేసీఆర్ రావాలి. లేదంటే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. ఆరు గ్యారంటీలంటే హైదరాబాద్ అగమవటం రాజకీయ అస్థిరత, ఆరునెలలకో సీఎం రావటం, మళ్ళీ కరెంట్ కష్టాలు రావటం మాత్రం గ్యారంటీ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కులం మతం, ప్రాంతం పేరు మీద కుంపట్లను ఎప్పుడు పెట్టలేదు. అభివృద్ధి తమ మొదటి లక్షణం అన్న వ్యక్తి కేసీఆర్.’ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement