Thursday, May 2, 2024

AP: మంచు దుప్పటిలో ఎన్టీఆర్ జిల్లా… విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

ఎన్టీఆర్ జిల్లా, ప్రభ న్యూస్ః పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం తెల్లవారుజాము నుండే ద‌ట్ట‌మైన పొగ‌మంచు అలముకుంది. జిల్లాలోని జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం, నందిగామ వంటి ప్రాంతాలతో పాటు, విజయవాడ నగరాన్ని సైతం మంచు కమ్మేసింది.

- Advertisement -

తెల్లవారుజాము నుండే దట్టంగా అలుముకుని ఉన్న మంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడుతుంది.మరి ముఖ్యంగా జాతీయ రహదారిపై కమ్ముకుని ఉన్న పొగ మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలవుతున్నప్పటికీ పొగ మంచు తగ్గకపోవడంతో వాహనాలన్నీ హైవేలపై హెడ్లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాలలో దట్టంగా పొగ మంచు ఉన్న కారణంగా వాహనాలను పక్కకు నిలుపుదల చేసి వెలుతురు కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు పొగ మంచు అడ్డంకిగా పరిణమించింది. రన్ వే పై సైతం పొగ మంచు దట్టంగా అలముకొని ఉన్న నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చే విమానాల రాక ఆలస్యం అవుతోంది. పొగ మంచు కారణంగా ఎయిర్ కంట్రోల్ అధికారులు విమానాల రాకపోకను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇటు నేషనల్ హైవే పైన అటు విమానాశ్రయంలోనూ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement