Friday, May 17, 2024

AP | ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌ ఉత్తీర్ణులు 31లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి

అమరావతి, ఆంధ్రప్రభ: ఫిబ్రవరి 2023లో జరిగిన నేషనల్‌ మీన్స్‌కంమెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షలో ఉత్తీర్ణత ఆధించిన విద్యార్ధులు స్కాలర్‌షాప్‌ పొందడానికి ఈ నెల 31వ తేదీలోగా నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోస్టల్‌లో దరఖాస్తులను సమర్పించాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి. దేవానందరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందుకోసం విద్యార్ధి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు తదితర వివరాలను సమర్పించాలన్నారు.

నమోదు చేయాలని ఆధార్‌ మిస్‌ మ్యాచ్‌ అని వచ్చిన వారు ఆ వివరాలను ఈ నెల 27వ తేదీలోగా జిల్లా విద్యాశాఖాధికారికి అందజేయాలన్నారు. విద్యార్ధులు ఆన్‌లైన్‌లో సబ్‌మిట్‌ చేసిన దరఖాస్తులను సబంధిత స్కూల్‌ నోడల్‌ ఆఫీసర్‌ లెవల్‌లో పిభ్రవరి 15వ తేదీ లోపు క్షుణ్ణంగా పరిశీలించి స్కూల్‌ నోడల్‌ ఆఫీసర్‌ లాగిన్‌ ద్వారా ధృవీకరించాలన్నారు. నవంబరు 2019, మార్చి 2022 సంవత్సరాలలో ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌కు ఎంపికయిన విద్యార్ధులు ఈ యేడాది తప్పనిసరిగా రెన్యువల్‌ చేసుకోవాలన్నారు. లేనియెడల స్కాలర్‌షిప్‌ మంజూరవదని దేవానందరెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement