Monday, May 6, 2024

భయపెడుతోన్న కరోనా: ఎపిలో నైట్‌ కర్ఫ్యూ?

అమరావతి – దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఏపీలో నిన్న ఒక్కరోజులో 6 వేలకు పైగా కేసులు వచ్చాయి. ఈ నేఫధ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కట్టడి కోసం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పెట్టె యోచనలో ఉన్నట్లు సమాచారం. రాత్రి కర్ఫ్యూ ద్వారా కొంతవరకు కరోనాను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చేవారం నుంచే రాత్రి కర్ఫ్యూ అమలు చేసే అవకాశం ఉంది. అంతేకాదు కేసుల పెరుగుదల తగ్గకపోతే గతంలో అమలు చేసిన లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో పాఠశాలలు నడిపే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం

Advertisement

తాజా వార్తలు

Advertisement