Tuesday, May 7, 2024

కోవిడ్ బాధితులకు వెల్లువెత్తుతున్న సాయం

కోవిడ్ సమయంలో సహాయం చేసే మనుషులున్నా, సాయం  చేయాలనే మనసున్నా కరోనాకి భయపడి అయినవాళ్లు కూడా బాధితుల దగ్గరకు రాలేకపోతున్నారు. మందులు, ఆహారం, ఆసుపత్రి అవసరాలు, అంత్యక్రియలు ఇలా దేనికీ, ఎవరూ ముందుకు రాని పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాకపోయినా, మేమున్నామంటూ తెలుగు రాష్ట్రాలలోని పలు స్వచ్ఛంధ సంస్థలు కరోనా రోగులకు, మృతులకు సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ బాధితులకు వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి సాయం వెల్లువెత్తున్నాయి. రెండు  రోజుల్లో కోటి 56లక్షల విలువైన మందులు, హెల్త్ కిట్లు , ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందజేశారు. ఈ మేరకు బయోఫోర్, ఇండియాబుల్స్, మనతెలుగు అసోసియేషన్, డీకన్సెస్ గేట్వే హాస్పిటల్స్  సాయమందించాయి. విరాళాలిచ్చిన వారి సూచనల మేరకు ఆయా జిల్లాలకు  పంపించారు.

కాగా, సాయమందించేందుకు  అనేక సంస్థలు, వ్యక్తులు ముందుకు రావడం అభినందనీయం అని స్టేట్ కొవిడ్ స్పెషల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ అన్నారు. వారిని స్ఫూర్తి గా తీసుకోవాలన్నారు. మరింత మంది  ముందుకొచ్చి ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement