Sunday, April 28, 2024

New Year Quote – చిరున‌వ్వుతో రోజును ప్రారంభించండి..అనుకున్న ల‌క్ష్యాన్ని సాధిస్తారుః భువ‌నేశ్వ‌రి ..

హైద‌రాబాద్ – కొత్త ఏడాదిలో ప్రజలు అనుకున్న లక్ష్యాలను సాధించాని, వాటి కోసం చిరునవ్వుతో రోజును ప్రారంభించాల‌ని కోరారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేడు డిజిటల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయనపై స్కిల్ డెవెలప్మెంట్ కేసులో జైలుకు పంపిన సమయంలో 53 రోజులు పాటు చంద్రబాబు కోసం నిలబడిన‌ తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

కేసులకు భయపడకుండా ప్రజలు బయటకు వచ్చి మాకు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్న భువనేశ్వరి మీరంతా చంద్రబాబు కోసం నిలబడినందుకు కృతజ్ఞతలు అన్నారు . ముఖ్యంగా మహిళలు నా మనస్సులో ఎప్పటకీ ఉండిపోతారన్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబు కోసం తెలుగు ప్రజలు నిలబడ్డారన్నారు. నూతన ఏడాదిలో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement