Friday, April 26, 2024

వైఎస్ వివేకా హత్యకేసులో కొత్త పరిణామం

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ఎన్నో మ‌లుపులు తిరుగుతోంది. ఇప్పుడు ఈ హ‌త్య కేసులో కొత్త ప‌రిణామం చోటుచేసుకుంది. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను గంగాధర్ రెడ్డి క‌లిశారు. సీబీఐ, వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని బాధితుడు గంగాధర్ రెడ్డి ఎస్పీని కోరారు. రూ.10 కోట్లు ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసిందని గంగాధర్ రెడ్డి తెలిపారు.

వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని సీబీఐ ఒత్తిళ్లు చేస్తోంద‌న్నారు. వారి ఒత్తిడితో తానే చంపానని ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు బెదిరింపులు చేశారన్నారు. వివేకా హత్య కేసులో తనకు సంబంధం లేదని, లేని విషయాన్ని ఉన్నట్లు చెప్పేదిలేదన్నారు. ఈసంద‌ర్భంగా అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ….వైఎస్ వివేకా హత్య కేసులో బెదిరింపులపై గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. గంగాధర్ రెడ్డికి రక్షణ కల్పిస్తామ‌న్నారు. సీబీఐ, వివేకా అనుచరులు, సీఐ శ్రీరాంపై ఫిర్యాదు చేశారన్నారు. డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామ‌న్నారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు గంగాధర్ చెబుతున్నారని, గంగాధర్ రెడ్డి ఫిర్యాదులోని అన్ని అంశాలపై విచారణ చేస్తామ‌ని ఎస్పీ ప‌క్కీర‌ప్ప తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement