Wednesday, May 5, 2021

కరోనాపై ఆందోళన చెందవద్దు – జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

జిల్లాకు 25 వేల డోసుల వ్యాక్సిన్
కొవిడ్‌ లక్షణాలు తక్కువగా ఉన్నవారు ఇళ్లవద్దనే ఐసోలేషన్‌లో ఉండాలి
90 శాతం ప్రజలకు కరోనా వచ్చేది, వెళ్లేది కూడా తెలియదు
ప్రజలు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి
నెల్లూరుజిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సూచనలు

కోట – కరోనా వైరస్‌ పట్ల ప్రజలు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలి అనినెల్లూరుజిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రజలకు సూచించారు. మంగళవారం కోట మండలంలోని, కోట అడ్డరోడ్డు లోకరోనా పాజిటివ్ తో హామ్ హైసిలేషన్ లో ఉన్న ఓ పేషెంట్లను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రంగా ఉందన్నారు. 90 శాతం ప్రజలకు కరోనా వచ్చేది, వెళ్లేది కూడా తెలియదన్నారు. కేవలం పదిశాతం మంది మాత్రమే ఇబ్బందులుపడుతున్నారన్నారు. వీరిలో ఐదు శాతం మందికి మాత్రమే సీరియస్‌ గా మారుతుందన్నారు. కొవిడ్‌ లక్షణాలు తక్కువగా ఉన్నవారు ఇళ్లవద్దనే ఐసోలేషన్‌లో ఉంటూ పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ వైద్యుల సూచనల మేరకు మందులు వేసుకుని విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందన్నారు.
సీరియస్‌ కేసులకు సంబంధించి గూడూరుఏరియా ఆసుపత్రిలో 20 పడకలతో ఐసోలేషన్‌ వార్డుతోపాటు ఐసీయూ సిద్దం చేసినట్లు వెల్లడించారు. గూడూరు పట్టణ పరిధిలోని టిడ్కో భవనంలోని కొవిడ్‌కేర్‌ సెంటర్‌లో కూడా వైద్యసేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.అదేవిధంగా గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కోట ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా 10 కోవిడ్ బెడ్ లు ఏర్పాటు చేసి ఆక్సిజన్ అందించే విధంగాచర్యలుతీసుకున్నామని తెలిపారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నెల్లూరు జిల్లాకు 25 వేల కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచాం అని,కరోనా గురించి ఎవరూ కుడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, డి పి ఓ ధనలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్,కోట తాహిసిల్దార్ రమాదేవి, కోట ఎంపీడీవో సుబ్బారావు, ఈ ఓ పి ఆర్ డి స్వరూపారాణి, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎంలు, గ్రామ కార్యదర్శులు, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు ఉన్నారు.
జిల్లా కలెక్టర్ సూచన మేరకు హోం ఐసొలేషన్‌:
లక్షణాలు లేకున్నా చాలామందిలో కరోనా పాజిటివ్‌ వస్తున్నందున జిల్లా కలెక్టర్ నూతన మార్గదర్శకాలు సూచించారు.

 • వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారికి ఇళ్లలోనే చికిత్స అందించాలి.
 • ఇంట్లో వసతులున్న వారంతా హోం ఐసొలేషన్‌లో ఉండేందుకు అవకాశం కల్పించాలి.
 • ఇప్పటిదాకా 17 రోజులుగా ఉన్న ఐసొలేషన్‌ గడువును పది రోజులకు కుదింపు.
 • ఈ కాలంలో వరుసగా 3రోజులపాటు ఎలాంటి లక్షణాలు లేకుంటే హోం ఐసొలేషన్‌ నుంచి డిశ్చార్జి చేయొచ్చని సూచన.
 • హోం ఐసొలేషన్‌ నుంచి డిశ్చార్జి అయినప్పటికీ మరో వారంపాటు రోగి తప్పకుండా ఇంట్లోనే ఉండాలని స్పష్టం.
 • కేంద్రం సూచన మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం.. లక్షణాలు లేని పాజిటివ్‌ రోగులను హోం ఐసొలేషన్‌కు తరలింపు.
 • హోం ఐసొలేషన్‌లో రికవరీ అయిన కేసుల్లోఆంద్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
  నిర్ణయంలోనే సగం విజయం:
  హోం ఐసొలేషన్‌లో ఉండాలనే నిర్ణయంలోనే సగం విజయం దాగుందని నిపుణులు అంటున్నారు.
 • పది రోజులపాటు ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిలో ఐసొలేషన్‌లో ఉండాలి.
 • గదిని శుభ్రంగా ఉంచుకోవడం తోపాటు వెలుతురు, గాలి బాగా ఉండేలా చూసుకోవాలి.
 • తప్పనిసరిగా ప్రత్యేక బాత్‌రూం ఉండాలి.
 • ఉపయోగించే పాత్రలు, వస్తువులు, దుస్తులను ఇతరులు తాకకూడదు.
 • మాస్కును అన్ని వేళలా ధరించాలి.
 • తరుచూ చేతులను శుభ్రం చేసుకోవాలి.
 • ఆరోగ్య సేతు యాప్‌తో అనుసంధానమై ఉండాలి.
Advertisement

తాజా వార్తలు

Prabha News