Thursday, July 29, 2021

సిటిస్కానింగ్‌ను ఏర్పాటు చేయండి..

బెల్లంపల్లి : బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రిలో సిటిస్కానింగ్‌ను ఏర్పాటు చేయాలని చాకెపల్లి ఎంపీటీసీ, బెల్లంపల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముడిమడుగుల మహేందర్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి ఏరియాసుపత్రిని జిల్లా ఐసోలేషన్‌ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందని, కనీస సౌకర్యాలు లేకుండా, ముఖ్యంగా సిటిస్కానింగ్‌ను ఏర్పాటు చేయాలని, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడంతో పేద ప్రజలకు, గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యంపై దృష్టిసారించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వవిప్‌ బాల్క సుమన్‌ అధ్యక్షత వహిస్తున్న జిల్లాలోనే ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జిల్లాలో పై#్రవేటు ఆసుపత్రుల్లో దోపిడీ అడ్డగోలుగా పెరిగిందని, జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లేక ప్రజల నుండి టెస్టుల పేరిట అడ్డగోలు డబ్బులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందంటే ప్రభుత్వతీరు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఎలాంటి సౌకర్యాలు లేక ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, బెల్లంపల్లి సింగరేణి ఏరియాసుపత్రిలో సిటిస్కానింగ్‌ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ తరుపున డిమాండ్‌ చేస్తున్నామని, లేనియెడల పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలు చైతన్యవంతమైన రానున్న రోజుల్లో బుద్ది చెప్తారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News