Saturday, December 7, 2024

ఆదమరిస్తే అంతే సంగతులు

చేతికి అందే స్థితిలో ట్రాన్స్ఫార్మర్
బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 19 ప్రభ న్యూస్ విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో చేతికందే స్థితిలో నగర పంచాయతీలోని ఖాజా నగర్ లో ట్రాన్స్ఫార్మర్ ఉంది. చుట్టుపక్కల అనేక కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీధికి అనుకొనే తక్కువ ఎత్తులో విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. అయితే తరచూ ఆ వీధిలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తుంటారు. చిన్నపిల్లలు వృద్ధులు ఎక్కువగా తిరుగుతుంటారు. ఆదమరిస్తే ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి చిన్నారులు, వృద్ధులు, మూగ జంతువులు ఎవరైనా వెళ్తే పెద్ద ప్రమాదమే ఎదురయ్యే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ కు రక్షణ వలయం ఏర్పాటు చేసి స్థానికులకు ఇబ్బందు లేకుండా చూడాలని కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement