Thursday, April 25, 2024

ప్లాస్టిక్ పై కమిషనర్ దండయాత్ర

బుచ్చిరెడ్డిపాలెం : పర్యావరణ కాలుష్యాన్ని పెంచే ప్లాస్టిక్ కవర్లపై నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి దండయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం అయినా నగర పంచాయతీలోని వివిధ దుకాణాలు వద్ద వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. చాపల మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న ప్లాస్టిక్ కావలెను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర పంచాయతీని స్వచ్ఛ బుచ్చిరెడ్డిపాలెంగా తయారు చేయడానికి నడుం బిగించామన్నారు. చైర్ పర్సన్ మోర్ల సుప్రజా కౌన్సిలర్లు అందరి సహకారంతో ప్లాస్టిక్ నివారణ చేపడుతున్నామన్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్ కవర్ లో బాటిల్ లో వాడవద్దని స్థానిక ప్రజలకు, వినియోగదారులకు, వ్యాపారస్తులకు, సూచించారు. ఒకసారి వాడి ప్లాస్టిక్ కవర్ లో బాటిల్ పడేయడం ద్వారా అవి మురికి కాలవలలో చేరి మురికి నీరు పోకుండా ఇబ్బందుల గురి చేస్తున్నా అన్నారు. తద్వారా మురుకు నీరు కాలవల్లో చేరి దోమలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ వాడితే వారికి మొదటి విడతగా ఫైన్ వేయడం ఆపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. కమిషనర్ చంద్రశేఖర్ తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement