Saturday, April 27, 2024

Muharram: తన బరువు చక్కెరను ఇచ్చి మొక్కు తీర్చుకున్న మంత్రి జయరామ్

కర్నూలు జిల్లా (ఆలూరు) : హాలహర్వి మండలంలోని కామినహాల్ గ్రామంలో ఈరోజు మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో వెలిసినటువంటి హాసేన్ హుస్సేన్ పీర్ల దేవులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ బద్ధంగా మంత్రి గుమ్మనూరు జయరాం చక్కెరతో తులభారం ఇచ్చి తమ మొక్కును సమర్పించుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… జగనన్న ముఖ్యమంత్రి పరిపాలన దేశంలోనే ఆదర్శంగా ఉందని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ స్వామిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది రైతులకు అధిక దిగుబడి రావాలని స్వామి వారిని మొక్కున్నారు. ప్రతి సంవత్సరం పీర్ల పండుగ సందర్భంగా ఈ గ్రామానికి రావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి, జడ్పీటీసీ లింగప్ప, మండల కన్వీనర్ భీమప్ప చౌదరి, కామిహాల్ సర్పంచ్ భర్త జనార్థన్ నాయుడు, చిప్పగిరి ఎంపీపీ భర్త మరయ్యా, మండల కన్వీనర్ వీరేష్, నాయకులు రంగారావు చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement