Thursday, May 2, 2024

టీడీపీ, జనసేనతో కలిసే పోటీ చేస్తా.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి, సెంట్రల్ ఆంధ్ర : రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసే తాను పోటీ చేస్తానని, అందులో ఎటువంటి సందేహం అక్కరలేదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తనని లక్ష్యంగా చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, నాయకురాళ్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనక ఉండి ఈ విమర్శలు చేయిస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నేరుగా తమపై విమర్శలు చేయవచ్చునని ఆయనకు ఒక ట్విట్టర్ అకౌంట్ ఉందని గుర్తు చేశారు. తన మనసులోని భావాలను ఒకటి అర ట్విట్ల రూపంలో రాయించుకుని పోస్టు చేయాలని సూచించారు.

ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి, తనని విమర్శిస్తే ఎక్కువ మంది చూస్తారని తెలిపారు. తనపై రోజు ఐదారు మంది పార్టీ నేతల చేత విమర్శలు చేయిస్తే, తాను చదివి వినిపించాలంటే ఇబ్బంది అవుతుందని ఎద్దేవా చేశారు. రెండు క్రూర మృగాల మధ్య వన్యప్రాణులు నలిగిపోవద్దంటూ తనపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రి తనని ఎంతలా రెచ్చగొట్టాలని చూసిన తాను రెచ్చిపోయేది లేదని స్పష్టం చేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి తిట్ల పురాణం తగ్గించారన్నారు.

మంచి మార్గంలో పయనిస్తున్న విజయ సాయిని అభినందిస్తున్నట్లు తెలిపారు. అయితే, తమ పార్టీకి చెందిన మరో ఆరుగురు నాయకులు, నాయకురాళ్లు ట్విట్టర్ వేదికగా తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక గంట వ్యవధిలోనే ఒకరి తరువాత మరొకరు తనపై ట్విట్ల వర్షం కురిపించారని తెలిపారు. 151 మంది తనపై ట్విట్టర్ వార్ కు వచ్చిన తనకొచ్చిన నష్టం, ఇబ్బంది ఏమీ లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. వీరంతా తనపై ఎందుకు ట్విట్లు పెట్టారన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement