Wednesday, May 15, 2024

ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి – సోద‌రుడు సుధాక‌ర్ రెడ్డి మృతి

వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సోద‌రుడు సుధాక‌ర్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో చెన్నైలో మృతి చెందారు. . సుధాకర్ రెడ్డి గత కొంతకాలంగా… అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన తీవ్ర అస్వస్థకు గురవటంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయనకు భార్య ..కుమారుడు కిరణ్ రెడ్డి అలాగే కుమార్తె దీప్తి ఉన్నారు. సుధాకర్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి చిన్న సోదరుడు… మరో సోదరుడు మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి. తనకు తన మరో సోదరుడు దివంగత సుబ్బరామిరెడ్డికి ..సుధాకర్ రెడ్డి తోడు నీడగా ఉండేవారని ఈ సందర్భంగా ఎంపీ మాగుంట ఎమోషనల్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement