Thursday, April 25, 2024

దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కులో ఎంపీ గురుమూర్తి బృందం స్టడీ టూర్..

తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో ఏపీ ఐఐసీ ప్రతినిధి బృందం తెలంగాణ‌లో ప‌ర్య‌టించింది. శుక్రవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ లోకి ఈ బృందం స‌భ్యులు వ‌చ్చారు. టిఐఎఫ్ గ్రీన్ ఎంఎస్ఎంఈ మోడల్ ఇండస్ట్రియల్ పార్కుకు ఎంపీ బృందం స్టడీ టూర్ కు వచ్చింది.

స్టడీ టూర్ కు వచ్చిన ఎపి బృందానికి దండు మల్కా పూర్ ఎంఎస్ఎంఈ పార్కులో టీఎస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టిఐఎఫ్ అధ్యక్షుడు కే. సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఎపి ప్రతినిధి బృందం దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కులో నెలకొల్పిన లే ఔట్, ప్లాటింగ్, రోడ్స్, డ్రైనేజ్, రెయిన్ వాటర్ డ్రైనేజ్ సిస్టం, కామన్ ఫెసిలిటీ సెంటర్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం, రోడ్స్ గ్రీనరీ, ప్లాంటింగ్, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పార్కులోని మౌలిక సదుపాయాలను, కామన్ ఫెసిలిటీ సెంటర్ లో ఏర్పాటు చేయబోయే స్కిల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ సూపర్ మార్కెట్, ఆడిటోరియం, బ్యాంకు సర్వీసెస్, కార్మికులకు, పారిశ్రామికవేత్తలకు ఇంకా వివిధ ప్రాంతాలనుండి వచ్చేవారికి RESTUARANT వంటి సదుపాయలను వివరించడం జరిగింది.

ఏపీ నుండి వచ్చిన ప్రతినుధులు టిఐఎఫ్ ప్రతినిధులతో సమావేశమై MSME పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉద్యోగ కల్పన, GST ద్వారా రెవెన్యూ, చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి జరుగుతుందని చర్చించారు. ఈ సందర్బంగా గౌరవ తిరుపతి లోక్ సభ సభ్యులు డాక్టర్ గురు మూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక దండుమల్కాపూర్ పార్కులో కాలుష్య రహిత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మొట్ట మొదటగా యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్లో 460 ఎకరాలలో మోడల్ ఇండస్ట్రియల్ పార్కును అత్యాధునిక మౌలిక వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలతో కేసిఆర్, కేటీఆర్ ప్రభుత్వం టిఫ్ ఆధ్వర్యంలో నెలకొల్పడం అభినందనీయమన్నారు.

ఎపి ఐఐసి చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి మాట్లాడుతూ msme ల కు, INTEGRATED TOWNSHIP, 150 సూక్ష్మ పరిశ్రమలకు అవకాశం, పెద్దవైన రోడ్స్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, స్టార్మ్ వాటర్ డ్రైన్స్, 40000 మొక్కలకు డ్రిప్ సదుపాయం అద్భుతంగా ఉందన్నారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ వర ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఈ విధమైన ఇండస్ట్రియల్ పార్కులు ఏపీ లో కూడా చేస్తామని తెలిపారు.

- Advertisement -

దీనితో పాటు ఇండస్ట్రియల్ టూరిజం ను కూడ అభివృద్ధి చేయాలనీ తద్వారా ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు స్టడీ టూర్ లాగా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఐఐసి ఉన్నతాధికారులు, యాదాద్రి జోనల్ మేనేజర్ శారద , టి ఐ ఎఫ్ కార్యదర్శి గోపాల్ రావు, కోశాధికారి Y. SUDHAKAR REDDY, INDUSTRIALISTS N. RANGA RAO, Dr. SATYANARAYANA ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement