Monday, April 29, 2024

సరిహద్దులో మావోయిస్టుల‌ కదలికలు, పోలీసులు అప్రమత్తం.. ముమ్మరంగా తనిఖీలు

ముంచంగిపుట్టు (విశాఖపట్నం), ప్రభ న్యూస్‌ : ఆంధ్ర – ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కొన్ని రోజులుగా మావోయిస్టుల కదలికలు అధికమయ్యాయని సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో సీఆర్పీఎఫ్‌ పోలీసులు బలగాలు కాపుకాస్తూ రాకపోకలపై నిఘాను ఉంచారు. ముఖ్యంగా మారుమూల బూసిపుట్టు-. బుంగాపుట్టు-, రంగబయలు ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తనిఖీలు చేశారు. ప్రయాణికుల వివరాలు సేకరించి విడిచి పెట్టారు. ముంచంగిపుట్టు- నుండి జోలాపుట్టు-, కుమడ, కుజభంగి మార్గల్లో కల్వర్టులు, వంతెనలను డాగ్‌, బాంబ్‌ స్క్వేడ్లతో తనిఖీలు చేస్తున్నారు.

సరిహద్దు ప్రాంతామైన ఒనకఢిల్లీ, మాచ్‌ ఖండ్‌, జోలాపుట్టు- గ్రామాల్లో సైతం బిఎస్‌ఎఫ్‌ బలగాలు. సరిహద్దు రాకపోకలకు నిఘాను పెంచారు. మంగళవారం స్థానిక ఎస్‌ఐ ఆర్‌.సంతోష్‌ ఆధ్వర్యంలో ముంచంగిపుట్టు-లో విస్తృతంగా తనిఖీలు చేసారు. ప్రయాణికుల బ్యాగులు, లగేజిలు పరిశీలించి విడిచి పెట్టారు. గత మూడు రోజులుగా మండల కేంద్రంలో రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులతో గస్తీని ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement