Tuesday, May 21, 2024

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం : అమరావతి జేఏసీ

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఉన్న అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించి సమస్యలు ప‌రిష్క‌రించ‌క‌పోతే ఉద్యమం తీవ్రత‌రం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్, ప్రధాన కార్యదర్శి గిరి కుమార్ రెడ్డి, కె.వై.కృష్ణ అన్నారు. బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో నిరసన చేపట్టారు. ఈ ఉద్యమానికి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష ధోరణియే కారణమన్నారు. ఈ ప్రభుత్వం వ‌చ్చాక ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ఉద్యోగుల విజ్ఞప్తుల మేరకు ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేసిన ఈ ప్రభుత్వ పీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కూడా జాప్యం చేస్తున్నదన్నారు. అంతే కాకుండా దశాభ్దాలుగా ఉన్న సౌకర్యాలకు కోతలు పెడుతుందని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యయ, రిటైర్డు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులలో ఉన్న అసంతృప్తిని, ఆవేదనను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. లేదంటే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్, ప్రధాన కార్యదర్శి గిరి కుమార్ రెడ్డి, కే.వై.కృష్ణ తెలిపారు. ఏపీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన మలిదశ ఉద్య‌మ కార్యచరణ చేప‌ట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంధ్రాలలో జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా కర్నూలు కలెక్టరేట్ వద్ద బుధవారం ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పై ఏపి జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ గిరి కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.వై.కృష్ణ, అసోసియేట్ చైర్మన్ నాగ రమణయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగుల సంబంధించి ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపైన, రాష్ట్రంలో ఉన్న నాలుగు లక్షలు పెన్షనర్ల‌కు ఉన్న ఇబ్బందులు, సమస్యల పైన ఫిబ్ర‌వ‌రి 13న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన 50 పేజీల మెమోరాండం ఇచ్చారు. ఈ సమస్యలను పరిష్క‌రించాలని మార్చి 7న మంత్రివర్గ ఉపసంఘం, ప్రభుత్వఉన్నతాధికార్లతో జరిగిన సమావేశంలో చర్చలు సందర్భంగా ఇచ్చిన హామీలలో సరైన స్పస్టత ఇవ్వలేదన్నారు. ఆ రోజు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు సంబంధించిన ప్రభుత్వం వాడుకున్న డబ్బులు జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ సంబంధించి, ఆర్టీసీ ఉద్యోగులకు ఓటీలు, మెడికిల్ రీ యంబ‌ర్స్ మెంట్ , ఈ.హెచ్.ఎస్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన భకాయిలు కొంత మేరకైనా మా పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం చెల్లింపులు చేసిందన్నారు. అయితే పెండింగ్ ఉన్న నాలుగు డీఏ అరియర్సుకు ఎంత చెల్లించాలి, పీఆర్సి అరియర్సుకు ఎంత చెల్లించాలి, పెండింగ్ లో ఉన్న మూడు కొత్త డీఏలు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏలు ఎప్పటిలోగా ఇస్తారో వీటన్నింటిపై అంశాలవారిగా రాతపూర్వకంగా ఏది ఎప్పుడు చెల్లిస్తారో కూడా టైమ్ షెడ్యూల్ అడిగితే దానిపై ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. అంతే కాకుండా మార్చి 24న ఈ హెచ్ఎస్ కార్డులు ఉద్యోగులకు, పెన్షనర్లకు ఉపయోగం లేకుండా పోతున్నాయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకొని మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల వైద్యం డబ్బులు నెలానెలా రికవరీ తీసుకొని కూడా సరైన వైద్యం అందడం లేదన్న ఆరోపణలపైన, పీఆర్సీ అరియర్సును రిటైర్ అయిన తరువాత ఇస్తామంటున్న అంశాలపై స్పష్టంగా ఉద్యోగ సంఘాలు అభిప్రాయాలు చెప్పినప్పటికీ ఆరోజు అంగీకరించిన అంశాలపై కూడా ఇంతివరకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే ఈ ఉద్యమ కార్యచరణ మలిదశకు చేరిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులు/పెన్షనర్లు సమస్యలు పరిష్కారంలో చిన్న చూపుతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా త్వరతిగతిన సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యోగులలో ఉన్న సహనం కోల్పోయి ఉద్యమం ఉదృతం అయ్యేఅవకాశాలు ఉంటాయని, ఈ ఉద్యమం వలన ప్రభుత్వానికీగాని, ప్రజలకు గాని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే దాని పర్యావసానాలు ప్రభుత్వమే బాధ్య‌త వహించాల్సి ఉంటుందని ఏపి జెఏసి అమరావతి నాయకులు అన్నారు.

ప్రభుత్వఉద్యోగుల,పెన్షనర్లు ప్రధాన డిమాండ్లు
ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లించాలి.
11వ పిఆర్సి ప్రతిపాదించిన స్కేల్స్ బయటపెట్టాలి.
పెండింగ్ ఉన్న 4 డిఎల అరియర్స్ చెల్లించాలి.
11వ పిఆర్సిఅరియర్స్ చెల్లించాలి.
12వ పిఆర్సి కమిషనర్ వెంటనే నియమించాలి.
పెండింగ్ ఉన్న మూడు కొత్త డిఎలను విడుదల చేయాలి.
పెన్షనర్లకు చెల్లించాల్సి డీఆర్ లను వెంటనే చెల్లించాలి.
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనీ డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలన్నారు. ఈ హెచ్ ఎస్ ద్వారా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో అమలు జరపాలన్నారు.కొత్త జిల్లా కేంద్రాలన్నిటిలోను 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలన్నారు. బుధ‌వారం జరిగిన ఈ ధర్నాకార్యక్రమంలో ఏపీ జెఎసి అమరావతి చైర్మన్, ప్రధాన కార్యదర్శి గిరి కుమార్ రెడ్డి కె.కృష్ణతో పాటు సహకార సంఘం నాగరమణయ్య ఏపీ టీటీడీ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఆ.వీరెడ్డి, శ్రీనివాసులు, పంచాయత్ రాజ్ ఇంజనీర్లు అసోసియేషన్, రవీంద్రారెడ్డి, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం, నాగేశ్వరరావు టైపిస్ట్ మరియు స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయక్, పెన్షనర్స్ అసోసియేషన్, శంకరప్ప, డిఆర్డిఏఉద్యోగుల సంఘం, గిడ్డయ్య, వీఆర్వో అసోసియేషన్, సూరి బాబు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రతాప్ , కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు, హెడ్ ​​మాస్టర్స్ అసోసియేషన్, మున్సిపల్ ఉపాధ్యాయ సంఘం నాయకులు తదధితరులతోపాటు అధికసంఖ్యలో ఉద్యోగులు పెన్షనర్లు పాల్గొన్నారు.

    Advertisement

    తాజా వార్తలు

    Advertisement