Thursday, May 16, 2024

పాల‌న సంస్క‌ర‌ణ‌ల అమ‌లులో ప్ర‌భుత్వం భేష్.. ఇది కదా అసలైన అభివృద్ధి

పాల‌న సంస్క‌ర‌ణ‌ల అమ‌లులో దేశంలోనే అత్యుత్త‌మ రీతిలో త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తున్న‌దని రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. నిర్ణ‌యాలను ఆచ‌ర‌ణలో సాధ్యం చేస్తూ ప్ర‌జా ప్ర‌భుత్వాల గౌర‌వాన్ని మరింత పెంచుతున్నామ‌ని వెల్ల‌డించారు. శ్రీ‌కాకుళం రూరల్ మండలం వప్పంగి జెడ్పి హై స్కూల్ లో రూ.1.62 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 14 అదనపు తరగతుల భ‌వ‌నం, ఇప్పిలి జెడ్పి హై స్కూల్లో రూ.82.99 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతుల సముదాయనికి సోమవారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పేద విద్యార్థుల చ‌దువుకు భ‌విత‌కు భ‌రోసా అమ్మ ఒడి అని అన్నారు. మూడేళ్ల క్రితం అందరి సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు అయ్యిందని గుర్తు చేశారు. ఎన్నిక‌ల హామీలో మేరకు విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. అమ్మఒడి ద్వారా బడికి పంపే తల్లుల ఖాతాల్లో రూ.15వేలు చొప్పున జమ చేస్తున్నామని తెలిపారు. బిడ్డ‌ల చ‌దువుల‌ను మ‌రింత ప్రోత్సహించేందుకు రూ.15 వేలు తల్లుల ఖాతాల్లో వేస్తున్నామన్నారు.

ఇంటి దగ్గర కూడా లభించని విధంగా నాణ్య‌మైన పోష‌కాహారం ప్రభుత్వం బడులలో పెడుతున్నామని మంత్రి ధర్మాన అన్నారు. జగనన్న విద్యా దీవెన, జ‌గ‌న‌న్న విద్యా కానుక ద్వారా పేద‌ల‌కు ఆర్థిక ల‌బ్ధి చేకూరిందని వివరించారు. నాడు – నేడు అమ‌లు ద్వారా ప్రభుత్వం బడులలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న జ‌రిగి, అనూహ్య మార్పులు వ‌చ్చాయని వెల్లడించారు. పోటీ ప్రపంచంలో బిడ్డ‌లు రాణించేందుకు బోధన విధానాల్లో మార్పు తీసుకు వచ్చి, అందుకు అనుగుణంగా కొత్త తరాన్ని తయారు చేస్తున్నామన్నారు. భ‌విష్య‌త్ కాలంలో పేద మ‌రియు మ‌ధ్య త‌ర‌గ‌తికి చెందిన పిల్ల‌లు స్థిరపడేందుకు, వారి ఉన్న‌తికి మార్గ దర్శకుడు సీఎం జగన్. విద్యలో మార్పులు చేయ‌డ‌మే కాదు, మానవ వనరుల అభివృద్ధికి దోహ‌ద‌ప‌డ‌డంలోనూ ఈ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోందన్నారు. త‌ద్వారా జీవ‌న ప్ర‌మాణాల మెరుగుద‌లతో పాటు ఈ త‌ర‌హా ప్ర‌ణాళికాయుత ప్ర‌తిపాద‌నల అమ‌లు అభివృద్ధిలో రేప‌టి వేళ ప్రధాన పాత్ర పోషించ‌నుందని తెలిపారు. విద్యకు సంబంధించి దేశంలో ఏపీ దేశంలో 22వ స్థానంలో ఉందన్నారు. వైఎస్సార్ హ‌యం నుంచి విద్యా వ్య‌వ‌స్థ‌లో సమూల మార్పులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. వాటికి కొన‌సాగింపే నేటి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యాలు, ప‌థ‌కాలు కూడా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement