Sunday, April 28, 2024

చీపురుప‌ల్లిలో మంత్రి బొత్స‌.. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కి శంఖుస్థాప‌న‌

విజయనగరం : చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటిస్తున్నారు.ఈ సంద‌ర్భంగా గరివిడిలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన చీపురుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాన్ని ప్రారంభించారు మంత్రి.రూ.16 లక్షలతో చీపురుపల్లి లో నిర్మించనున్న డిజిటల్ లైబ్రరికి శంకుస్థాపన చేశారు. చీపురుపల్లి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్యానల్ ను ప్రారంభించారు. చీపురుపల్లి లో నియోజకవర్గ స్థాయిలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి బొత్స. పదో తరగతి, ఇంటర్ లో టాప్ ర్యాంక్ కు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికం, మెడల్, జ్ఞాపికలు బహూకరించారు బొత్స‌.

విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులను శాలువాతో సత్కరించారు బొత్స .. అనంత‌రం రాష్ట్రంలోని విద్యార్థులు అందరిలో స్ఫూర్తిని కలిగించే లక్ష్యంతో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం చేపట్టామ‌న్నారు. డిజిటల్ విద్యా విధానంతో ప్రపంచంతో పోటీ పడే విధంగా మన విద్యార్థులను తీర్చి దిద్దుతున్నామ‌న్నారు. విద్యార్ధులకు అన్ని వసతులు కల్పిస్తూ వారి తల్లిదండ్రుల కంటే మిన్నగా సీఎం జగన్ వారి బాగోగులు చూసుకుంటున్నార‌ని తెలిపారు. ఈ ఏడాది జ‌గ‌న్ పుట్టిన‌రోజుకి మళ్లీ విద్యార్థులకు టాబ్ లు పంపిణీ చేస్తాం.. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రెండో ఎం.ఇ.ఓ. పోస్టు మంజూరు చేశాం..అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి ఎస్, డి.ఇ.ఓ. లింగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement