Friday, March 1, 2024

పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు : ఎమ్మెల్యే రేఖ

కడెం, ప్రభ న్యూస్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చని ఏల్లాపుర్ లింగాపూర్ తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవ వేడుకల కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన పల్లెలు దేశానికి ఆదర్శం అని, పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయ‌ని తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో ఎనలేని అభివృద్ధి జరిగిందన్నారు. నిర్మల్ డిఆర్డిఓ విజయలక్ష్మి, ఏపీడి గోవిందరావు, స్థానిక గ్రామాల సర్పంచ్ లు బొడ్డు గంగన్న, ఆకుల బాలవ్వ, ఖానాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ ఖానాపూర్ ఏఎంసి డైరెక్టర్ మంగ సతీష్, కడెం తహసిల్దార్ చిన్నయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీఓ ఉపేందర్, ఈజీఎస్ ఏపిఓ జయదేవ్, ప్రభుత్వ శాఖల, మండల స్థాయి అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement