Sunday, May 19, 2024

కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసిన మంత్రి అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. ఖరీఫ్‌ పంట కోసం కృష్ణా డెల్టాలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. కృష్ణా తూర్పు డెల్టాకి 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకి 500 క్యూసెక్కులు సాగునీరు విడుదలైంది. కృష్ణా డెల్టా చరిత్రలో ముందుగానే సాగునీటిని విడుదల చేయడం రికార్డు. నెలరోజుల ముందే సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసింది. కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలు ఉన్నాయి. పులిచింతలలో పుష్కలంగా నీరు ఉండటంతో 35 టీఎంసీల సాగునీరు అందుబాటులోకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement