Saturday, May 4, 2024

న‌వీ ముంబైలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణం.. భూమి పత్రాలను అందించిన ‘మ‌హా’ మంత్రి

మహారాష్ట్రలోని నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర‌ ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్ర‌భుత్వం తరపున ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే టీటీడీకి భూమి పత్రాలను అందజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం ఉద‌యం బోర్డు మీటింగ్‌ ప్రారంభానికి ముందు చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, బోర్డు స‌భ్యులు, టీటీడీ ఉన్నతాధికారుల స‌మ‌క్షంలో మ‌హారాష్ట్ర మంత్రి పత్రాలను అందించారు.

రేమండ్ గ్రూప్ చైర్మన్, ఎండి గౌతమ్ సింఘానియా తరపున రేమండ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ సరిన్ ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదిత్య ఠాక్రే, సంజీవ్ సారిన్‌లను టీటీడీ చైర్మన్ సత్కరించారు. నవీ ముంబయిలోని ఉల్వేలో 10 ఎకరాల భూమిని కేటాయించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చినందుకు రేమండ్ గ్రూప్ చైర్మన్‌కు గౌతమ్ సింఘానియాకు టీటీడీ చైర్మ‌న్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement